చికిత్స పొందుతూ యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-07-08T06:26:44+05:30 IST

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

చికిత్స పొందుతూ యువకుడి మృతి

కట్టంగూరు, జూలై 7: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి మాదాను రాహుల్‌(20) తండ్రి ఆంథోనితో కలిసి స్వగ్రా మం నుంచి బైక్‌పై నార్కట్‌పల్లికి వెళుతుండగా అయిటిపాముల గ్రామ శివారులో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాహుల్‌ను నార్కట్‌పల్లి  కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.


Updated Date - 2021-07-08T06:26:44+05:30 IST