వైద్య సిబ్బంది కృషి అభినందనీయం: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-01-21T05:19:47+05:30 IST
పట్టణంలోని అంబేడ్కర్ కాలనీ అర్బన్ ఆస్పత్రిలో బుధవారం కొవిడ్ వ్యాక్సినేషన్‌ను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రారంభించారు.

కోదాడ రూరల్, జనవరి 20 : పట్టణంలోని అంబేడ్కర్ కాలనీ అర్బన్ ఆస్పత్రిలో బుధవారం కొవిడ్ వ్యాక్సినేషన్‌ను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనదేశం వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. సకాలంలో ప్రజలకు వ్యాక్సిన్ అందించిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ముం దుగా వైద్య సిబ్బందికి టీకాలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. టీకా వచ్చింది కదా అని కరోనాపై నిర్లక్ష్యం తగదని; తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు.