మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

ABN , First Publish Date - 2021-08-20T06:14:13+05:30 IST

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లోని పీర్లచావిడి వద్ద గురువారం నిర్వహించిన మొహర్రం వేడుకలలో ఆయన పాల్గొన్నారు

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
మొహర్రం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

హుజూర్‌నగర్‌, ఆగస్టు 19 : మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లోని పీర్లచావిడి వద్ద గురువారం నిర్వహించిన మొహర్రం వేడుకలలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ పండుగలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాలన్నారు. కులమతాలకు అతీతంగా భక్తిభావంతో పండుగలు నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో ముజావర్లు షేక్‌ సైదా, ఫరీద్‌, మోయిన్‌, జక్కుల నాగేశ్వరరావు, గెల్లి రవి, అమర్‌నాథ్‌రెడ్డి, హరిబాబుచౌదరి, అమర్‌, సాయిరామ్‌, ఉపేందర్‌యాదవ్‌, గురవయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-20T06:14:13+05:30 IST