ఓటుకు నోటు కేసులో సమాధానం చెప్పాలి
ABN , First Publish Date - 2021-07-08T05:54:04+05:30 IST
ఓటుకు నోటు కేసులో బహిరంగంగా దొరికిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

హుజూర్‌నగర్, జూలై 7 : ఓటుకు నోటు కేసులో బహిరంగంగా దొరికిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్‌నగర్ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎ్‌సలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని రేవంత్‌రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు. ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షలతో ఎమ్మెల్సీని కొనాలని ప్రయత్నించిన రేవంత్‌ను ఏం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలను టీఆర్‌ఎ్‌సకు సరఫరా చేసే కంపెనీ కాదా అని ప్రశ్నించారు. దళిత సాధికారత పేరుతో సీఎం కేసీఆర్ దళితులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మంత్రులకే కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రగతి భవన్ నుంచి కేసీఆర్‌ను తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. టీఆర్‌ఎస్ నుంచి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడంతో కేసీఆర్‌కు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. హుజూరాబాద్‌లో కేసీఆర్ ఓటమి ఖాయమని, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, నూనె సులోచన, కనగాల వెంకట్రామయ్య, బాల వెంకటేశ్వర్లు, తోట శేషు, పత్తిపాటి విజయ్, పోకల వెంకటేశ్వర్లు, వేముల శేఖర్‌రెడ్డి, మరియదాసు, వీరబాబు, గిరి, రామయ్య, వెంకన్న, వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరరావు, గోపి, రవి, దేనమకొండరామరాజు పాల్గొన్నారు.