ద్విచక్ర వాహనం అదుపు తప్పి గీత కార్మికుడు మృతి

ABN , First Publish Date - 2021-11-09T06:33:26+05:30 IST

ద్విచక్ర వాహనం అదుపు త ప్పిపడిన ప్రమాదం లో గీత కార్మికుడు మృతి చెందాడు.

ద్విచక్ర వాహనం అదుపు తప్పి గీత కార్మికుడు మృతి
గుంతలో పడి మృతి చెందని వెంకన్న

మోత్కూరు, న వంబరు 8: ద్విచక్ర వాహనం అదుపు త ప్పిపడిన ప్రమాదం లో గీత కార్మికుడు మృతి చెందాడు. కు టుంబ సభ్యులు, పో లీసులు తెలిపిన వి వరాల ప్రకారం... మోత్కూరు పట్టణా నికి చెందిన అన్నెపు వెంకన్న(38) ఆదివారం సాయంత్రం రోజు మాదిరిగానే తాటి చెట్ల నుం చి కల్లు తీసి తెచ్చి అమ్మాడు. ఆ తర్వాత బయటకు వెళ్లాడు. ఎంత రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. మోత్కూరు-పనకబండ రోడ్డులో ఈర్లపల్లిబావి సమీపంలో సో మవారం ఉదయం ఓ వ్యక్తి మూత్ర విసర్జనకు వెళ్లాడు. అక్కడ గుంతలో ఓ వ్యకి, బైక్‌ పడి ఉండటాన్ని చూసి గ్రామస్థులు, పోలీసులకు సమాచా రం అందించాడు. అప్పటికే అతను మృతి చెందగా అన్నెపు వెంకన్నగా గుర్తించారు. ఆ ప్రాంతంలో పేకాట స్థావరాలు ఉన్నాయ ని, అక్కడ పే కాట ఆడే వారికి అతను మద్యం, తినుబండారాలు సరఫరా చేస్తాడని ప లువురు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి వెంకన్న మద్యం తాగి బైక్‌పై వెళ్లి వస్తుండగా బైక్‌ అదుపుతప్పి గుంతలో పడి మృతి చెంది ఉంటాడని భా విస్తున్నారు. వెంకన్నకు భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-11-09T06:33:26+05:30 IST