పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2021-08-20T07:10:10+05:30 IST

భువనగిరి పట్టణాన్ని పారిశుధ్యంలో ఆద ర్శంగా తీర్చిదిద్దాలని మునిసిపల్‌ చెర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు అన్నారు.

పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి
భువనగిరిలో పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతున్న చైర్మన్‌ ఆంజనేయులు

భువనగిరిటౌన్‌, ఆగస్టు 19:  భువనగిరి పట్టణాన్ని పారిశుధ్యంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని మునిసిపల్‌ చెర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు అన్నారు. గురువారం తెల్లవారుజామున పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజలతో, పారిశుధ్య కార్మికులతో ఆంజనేయులు మాట్లాడి పారిశుధ్య పనుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. పట్టణంలో పారిశుఽ ద్యానికి ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని చైర్మన్‌ కోరారు. ఆయన వెంట మునిసిపల్‌ అధికారులు ఉన్నారు. Updated Date - 2021-08-20T07:10:10+05:30 IST