క్రీస్తు బోధనలు ప్రపంచానికే ఆదర్శం

ABN , First Publish Date - 2021-12-25T06:43:28+05:30 IST

ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. సూర్యాపేటలోని సెంటినరీ బాప్టిస్టు చర్చిలో శుక్రవారం నిర్వహించిన సెమీక్రిస్మస్‌ వేడుకల్లో ఆమె మాట్లాడారు.

క్రీస్తు బోధనలు ప్రపంచానికే ఆదర్శం
సూర్యాపేటలోని సెంటినరీ బాప్టిస్టు చర్చిలో కేక్‌ కట్‌ చేస్తున్నమునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ

 మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ 

 క్రిస్మస్‌ వేడుకలకు చర్చీల ముస్తాబు

పలు ప్రాంతాల్లో దుస్తుల పంపిణీ

సూర్యాపేట కల్చరల్‌, డిసెంబరు 24: ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని  మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. సూర్యాపేటలోని సెంటినరీ బాప్టిస్టు చర్చిలో శుక్రవారం నిర్వహించిన సెమీక్రిస్మస్‌ వేడుకల్లో ఆమె మాట్లాడారు. క్రైస్తవులు పరమ పవిత్రం గా భావించే ఏసుక్రీస్తు పుట్టిన రోజు వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు.  అనంతరం కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ శుభాకాంలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శి తమన్‌, సెంటినరీ బాప్టిస్ట్‌ చర్చి పాస్టర్‌  ప్రభుదాస్‌, గండూరి ప్రకాష్‌, కౌన్సిలర్‌ జ్యోతిశ్రీవిద్య, జ్యోతికర్ణాకర్‌, చర్చి అధ్యక్షుడు హ్యూబర్ట్‌ రాజన్‌ పాల్గొన్నారు.

సర్వ మతాల అభివృద్ధికి సీఎం కృషి: వెంకటనారాయణగౌడ్‌  

రాష్ట్రంలో సర్వ మతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌ అన్నారు. సూర్యాపేట లోని ఓ ప్రైవేటు  ఫంక్షన్‌హాల్‌లో క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్రకుమార్‌, ముని సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, తహసీల్ధార్‌ వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కిషోర్‌, మార్కె ట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితాదేవీ, జడ్పీటీసీ బిక్షం పాల్గొన్నారు. 

మఠంపల్లిలో ప్రారంభమైన క్రిస్మస్‌ వేడుకలు

మఠంపల్లి: దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మఠంపల్లి శుభవార్త దేవాలయంలో కిస్మస్‌ వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాల యాన్ని రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. శనివారం ఉదయం ఆరు గంటలకు జపాలు, దివ్య బలిపూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏడు గంటలకు దివ్యబలిపూజ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభిస్తారు. తొమ్మిది గంటలకు శభవార్త పండుగ సమిష్టి దివ్యబలిపూజను నల్ల గొండ బిషప్‌ గోవిందజోజి నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కొవ్వొత్తుల సమర్పణ, సాయంత్రం ఐదు గంటలకు మరియ మాత విగ్రహాన్ని రథంపై పట్టణంలో ఊరేగిస్తామని విచారణ గురువు పసల మార్టిన్‌ తెలిపారుఆదివారం ఉదయం ఏడు గంటలకు దివ్యబలిపూజ (పెద్దల పూజ) నిర్వహిస్తామన్నారు.




Updated Date - 2021-12-25T06:43:28+05:30 IST