అనుమానితులు పోలీసులకు అప్పగింత

ABN , First Publish Date - 2021-12-08T06:24:52+05:30 IST

గ్రామంలో అనుమానాస్పదంగా అయ్యప్ప మాలధారుల దుస్తుల్లో సంచరిస్తున్న ఇద్దరిని గ్రామస్థులకు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

అనుమానితులు పోలీసులకు అప్పగింత

యాదాద్రి రూరల్‌, డిసెంబరు 7: గ్రామంలో అనుమానాస్పదంగా అయ్యప్ప మాలధారుల దుస్తుల్లో సంచరిస్తున్న ఇద్దరిని  గ్రామస్థులకు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.  యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం సర్పంచ్‌ శ్రీశైలం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి మంగళవారం ఉదయం బైక్‌ ఇద్దరు వ్యక్తులు అయ్యప్ప మాలధారణ దుస్తుల్లో వచ్చి గ్రామంలో కాలినడకన తిరుగుతున్నారు. గ్రామస్థులు అనుమానంతో వారిని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు.  వారిని గ్రామస్థులు సోదా చేయగా తాయెత్తులు దొరకడంతో పోలీసులకు అప్ప గించారు. ఖమ్మం జిల్లాకు చెందిన తాము భిక్షాటన చేయడానికి గ్రామానికి వచ్చామని నిందితులు పోలీసులకు తెలిపారు. ఈ ఇద్దరినీ  తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఇదే గ్రామానికి 15 రోజుల క్రితం అయ్యప్ప మాలధారణ దుస్తులతో వచ్చిన ఇద్దరు కందూకూర్‌ పుష్ప దుకాణానికి వెళ్లారు. దుకాణంలో సబ్బులు, కొబ్బరి నూనె డబ్బాలు తీసుకుని ఉడాయించారు. దీంతో అను మానించి గ్రామస్థులు మంగళవారం వచ్చిన ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. 


Updated Date - 2021-12-08T06:24:52+05:30 IST