పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , First Publish Date - 2021-10-31T06:24:59+05:30 IST

ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేక అధికారి యాదయ్య, మునిసిపల్‌ కమిషనర్‌ మహమూద్‌ అన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
మోటకొండూరులో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

 మోత్కూరు, అక్టోబరు 30: ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేక అధికారి యాదయ్య, మునిసిపల్‌ కమిషనర్‌ మహమూద్‌ అన్నారు. శనివారం మోత్కూరు మునిసిపాలిటీలో 1వ వార్డులో నిర్వహించిన స్వచ్ఛ శనివారం కార్యక్రమంలో వారు పా ల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వీధుల్లో, ఇళ్ల పక్కన ఉన్న చెత్తాచెదారా న్ని తొలగించారు. కార్యక్రమంలో మేనేజర్‌ ప్రభాకర్‌, ఆర్‌ఐ సోమయ్య, ఎన్విరాన్మెంట్‌ ఇంజనీర్‌ శ్రావణ్‌కుమార్‌, మునిసిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. బొమ్మలరామారం: మండలంలోని సోలిపేట, మైలారం రామలింగంపల్లి, ఫక్కీరుగూడెం, బొమ్మలరామారం గ్రామాల్లో స్వచ్ఛ శనివారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా సర్పంచులు మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వాడకంపై ఎదురయ్యే సమస్యలను గురించి వివరించారు. గ్రామంలో  చెత్త, వ్యర్థాలను శ్రమదానం చేసి తొలగించారు. అనంతరం ఇంటింటికీ తి రిగి వ్యాక్సినేషన టీకాలు ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మేడబోయిన గణేష్‌, బొమ్మలరామారం, మైలారం, సోలిపేట సర్పంచులు రాంపల్లి మహే్‌షగౌడ్‌, వడ్లకొండ అరుణ, నవీనకుమార్‌, ఉ పసర్పంచ భరత, వార్డుసభ్యులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. 

మోటకొండూర్‌: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సర్పంచ వడ్డెబోయిన శ్రీలత అన్నారు. స్వచ్ఛ  శనివారంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో చెత్త వేయవద్దని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ రేగు శ్రీనివాస్‌, వార్డు సభ్యులు బీరకాయల మల్లేశ, జంపాల సత్తమ్మ, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌, బుగ్గ శ్రీశైలం, దయాకర్‌ పాల్గొన్నారు. 

భూదానపోచంపల్లి: స్వచ్ఛ తెలంగాణ లక్ష్యంతో ప్రతీ వార్డును పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని కౌన్సిలర్‌ సామల మల్లారెడ్డి అన్నారు. శనివారం  మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు పరిధిలో స్వచ్ఛ శనివారం పురస్కరించుకుని వార్డు శుభ్రత, పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్నం సుదర్శన, వైస్‌చైర్మన బాత్క లింగస్వామి, నా యకులు బండి యాదగిరిగౌడ్‌, రామిడి జంగారెడ్డి, మహే్‌షగౌడ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, రమే్‌షగౌడ్‌, బాల్‌రెడ్డి, సత్తిరెడ్డి, రాముగౌడ్‌, మణికంఠ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-31T06:24:59+05:30 IST