లైంగికదాడి కేసు విచారణ ముమ్మరం

ABN , First Publish Date - 2021-12-31T05:11:55+05:30 IST

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలానికి చెందిన దళిత యువతిపై లైంగిక దాడి ఘటనలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

లైంగికదాడి కేసు విచారణ ముమ్మరం
మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న బీఎస్పీ నాయకులు

 యువతి నుంచి రక్తనమూనాల సేకరణ

ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నల్లగొండ/నల్లగొండ క్రైం డిసెంబరు 30 : నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలానికి చెందిన దళిత యువతిపై లైంగిక దాడి ఘటనలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ‘దళిత బాలికపై ఏడు నెలలుగా ఏడుగురి లైంగికదాడి’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 29న కథనం ప్రచురితం కావడంతో పోలీసులు స్పందించారు. బాధితురాలి నుంచి రక్తనమూనాలు సేకరించి, వైద్య పరీక్షలకు తరలించారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడైన ప్రభుత్వ చిరుద్యోగిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు నాంపల్లి సీఐ సత్యం తెలిపారు. అతడిచ్చిన సమాచారంతో కేసు విచారణను ముమ్మరం చేశారు. 

నిందితులను రిమాండ్‌ చేయాలి

మర్రిగూడ : దళిత యువతిపై లైంగికదాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌ చేయాలని బీఎస్పీ నాయకుడు పెండం ధనంజయ్య డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లా మరిగ్రూడ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట బీఎస్పీ ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. యువతి గర్భం దాల్చడానికి కారణమైన ఏడుగురు మంది నిందితుల్లో ఒకరిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారని; త్వరగా మిగతా వారిని అరెస్టు చేయాలని అన్నారు. యువతికి న్యాయం చేసేలా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసి నిందితులకు శిక్ష పడేలాచర్యలు తీసుకోవాలన్నారు. ఆందోళనలో బీఎస్పీ నియోజకవర్గం అధ్యక్షుడు సామ్రాట్‌ కిరణ్‌, జగన్నాథంగౌడ్‌, బొట్టుశివ, వెంకటే్‌షగౌడ్‌, స్వామి, ప్రవీన్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-12-31T05:11:55+05:30 IST