గండూరి ప్రీతంజోనా ట్రస్టు సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2021-09-02T07:25:00+05:30 IST

గండూరి ప్రీతంజోనా ట్రస్టు సేవలు అభినందనీయమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. మాజీ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళ్లికాప్రకాష్‌ కుమారుడు ప్రీతంజోనా వర్ధంతి సందర్బంగా సూర్యాపేటలోని అమ్మగార్డెన్‌లో ప్రీతంజోనా సమాధి వద్ద బుధవారం నివాళులర్పించి మాట్లాడారు.

గండూరి ప్రీతంజోనా ట్రస్టు సేవలు అభినందనీయం
ప్రీతంజోనా జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన ఉచిత వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

సూర్యాపేటటౌన్‌, సెప్టెంబరు 1: గండూరి ప్రీతంజోనా ట్రస్టు సేవలు అభినందనీయమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. మాజీ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళ్లికాప్రకాష్‌ కుమారుడు ప్రీతంజోనా వర్ధంతి సందర్బంగా సూర్యాపేటలోని అమ్మగార్డెన్‌లో ప్రీతంజోనా సమాధి వద్ద బుధవారం నివాళులర్పించి మాట్లాడారు.  ప్రకాష్‌– ప్రవళ్లికల సేవాగుణం సమాజానికి ఆదర్శమన్నారు. అనంతరం  ప్రీతంజోనా జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన ఉచిత వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్‌, బొల్లం మల్లయ్యయాదవ్‌,  నిమ్మలశ్రీనివాస్‌గౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌  ఉప్పల లలితాదేవిఆనంద్‌,  యుగేంధర్‌రావు పాల్గొన్నారు.
Updated Date - 2021-09-02T07:25:00+05:30 IST