ఉపసర్పంచ్‌పై సర్పంచ్‌ కుమారుడు దాడి

ABN , First Publish Date - 2021-12-08T06:17:32+05:30 IST

పంచాయతీ నిధుల వ్యవహారంలో నెలకొన్న వివాదం ఉపసర్పంచ్‌పై సర్పంచ్‌ కుమారుడు దాడి చేసేందుకు దారీతీసింది.

ఉపసర్పంచ్‌పై సర్పంచ్‌ కుమారుడు దాడి

నడిగూడెం, డిసెంబరు 7: పంచాయతీ నిధుల వ్యవహారంలో నెలకొన్న వివాదం ఉపసర్పంచ్‌పై సర్పంచ్‌ కుమారుడు దాడి చేసేందుకు దారీతీసింది. చెన్నకేశవపురం గ్రామపంచాయతీ సాక్షిగా మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. జాయింట్‌ చెక్‌పవర్‌ ఉన్న ఉపసర్పంచ్‌ సంతకం పెట్టకుండా జాప్యం చేస్తుండటంపై మాట్లాడేందుకు ఎంపీవో లింగారెడ్డి, కార్యదర్శి పంచాయతీ కార్యా లయంలో సమావేశమై సర్పంచ్‌, ఉపసర్పంచులను పిలిపించగా సర్పంచ్‌ హాజరుకాలేదు దీంతో ఉపసర్పంచ్‌ నిలదీశారు. సర్పంచ్‌ పుల్లమ్మ కుమారుడు పిచ్చయ్య నేనే సర్పంచ్‌ అని తెలపడం, సర్పంచ్‌ నీవు కాదు పుల్లమ్మ రావాలని ఉపసర్పంచ్‌ ఉపేందర్‌ అనడంతో ఇరువురి మధ్య వాగ్వా దం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సర్పంచ్‌ కుమారుడు కె.పిచ్చయ్య ఉపసర్పంచ్‌పై దాడికి దిగారు. ఇంతలో గ్రామస్థులు రావడంతో సర్పంచ్‌ హాజరుకావాలని సర్ధిచెప్పి అధికారులు వెళ్లిపోయారు. అనంతరం సర్పంచ్‌ కుమారుడు తనపై దాడి చేశారని ఉపసర్పంచ్‌ ఎంపీడీవో, ఎస్‌ఐలకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్‌ఐను వివరణ కోరగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని, ఇరువురు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపారు. 


Updated Date - 2021-12-08T06:17:32+05:30 IST