మాదిగ విద్యార్థుల గర్జనను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-12-31T05:36:01+05:30 IST

ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఫిబ్రవరి 12వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించే మాదిగ విద్యార్థుల గర్జనను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు యాతాకుల రాజయ్య, కందుకూరి సోమయ్యమాదిగ కోరారు. జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో

మాదిగ విద్యార్థుల గర్జనను విజయవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

సూర్యాపేటటౌన్‌, డిసెంబరు 30: ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఫిబ్రవరి 12వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించే మాదిగ విద్యార్థుల గర్జనను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు యాతాకుల రాజయ్య, కందుకూరి సోమయ్యమాదిగ కోరారు. జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చింతలపాటి చినశ్రీరాములు, ఎర్ర వీరస్వామి, బోడ శ్రీరాములుమాదిగ, రాజు, పుట్టల మల్లేష్‌, దైద వెంకన్న, సావిత్రి, రాము, ఆంజనేయులు, సైదులు, వెంకట్రాములు, సతీష్‌, చంద్రశేఖర్‌, కృష్ణ, వినయ్‌  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T05:36:01+05:30 IST