ఫలించిన పల్లా మంత్రాంగం

ABN , First Publish Date - 2021-03-22T06:23:59+05:30 IST

పోటీ చేయాలా? వద్దా? అనుకునే స్థాయి నుంచి పార్టీ బలానికితోడు తన మంత్రాంగంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జయకేతనం ఎగురవేశారు.

ఫలించిన పల్లా మంత్రాంగం
సీఎంను కలిసిన పల్లా, మంత్రి జగదీష్‌రెడ్డి తదితరులు, పల్లాను సన్మానించి అభినందనలు తెలిపిన కేసీఆర్‌

పార్టీ బలం, విపక్ష ఓట్ల చీలికతో విజయం


నల్లగొండ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పోటీ చేయాలా? వద్దా? అనుకునే స్థాయి నుంచి పార్టీ బలానికితోడు తన మంత్రాంగంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జయకేతనం ఎగురవేశారు. పోలింగ్‌ బూత్‌ల లో కూర్చునేందుకు మనుషులే లేని స్థితిలో తీన్మార్‌ మల్లన్న, కోదండరా మ్‌, అధికార టీఆర్‌ఎ్‌సతో చివరివరకు హోరాహోరీగా పోరాడారు. గెలుపే లక్ష్యంగా బాహుబలితో సామాన్యులు చేసిన పోరాటం ఆది నుంచి కౌంటిం గ్‌ చివరి వరకు రంజుగా సాగింది.

ప్రణాళికాబద్ధంగా పల్లా అడుగులు

ప్రభుత్వ వ్యతిరేక పెరిగిందన్న ప్రచారం నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక గోదాలో దిగిన పల్లా రాజేశ్వరరెడ్డి తన మంత్రాంగంతో చివరికి విజయం సాధించారు. అధికారికంగా అభ్యర్థి ప్రకటన చేయకముం దే, నోటిఫికేషన్‌ రాకముందే 12జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో సన్నద్ధ సమావేశాలు నిర్వహించారు. నోటిఫికేషన్‌ తదుపరి ఓటరు నమోదుపై దృష్టిపెట్టారు. ప్రణాళికలో భాగంగా ఇంటింటికీ తిరగడం,ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ఆన్‌లైన్‌లో ఓట్లు నమోదు చే యించడం,అవి తిరస్కరణకు గురికాకుండా చూసుకోవడం, 50మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించారు. ప్రచారంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటుచేశారు. తాము నమోదు చేయించిన; పార్టీ నుంచి పూర్తి సహాయ సహకారాలు పొందిన ఓటర్లను గుర్తించి పోలింగ్‌ బూత్‌ వరకు తీసుకెళ్లి ఓటు వేయించారు. వార్డు సభ్యుడు మొదలు మంత్రులు, ఎంపీల వరకు ఉన్న పట్టభద్రులతోపాటు తాము అనుకున్న ఓట్లు పక్కాగా మొదటి ప్రాధాన్యానికి వేయించుకోవడంలో అధికార టీఆర్‌ఎస్‌ నూటికి నూరుశాతం విజ యం సాధించింది. ప్రభుత్వ ఉద్యోగులైన టీఎన్‌జీవోలు, పోలీసులు, విద్యుత్‌,వైద్యశాఖ, ఉపాధ్యాయుల్లోని ఓ వర్గం మద్దతు పొందారు. దీంతో ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్లు టీఆర్‌ఎ్‌సకు అధికంగా వచ్చినట్టు సమాచారం. వీరితోపాటు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, సిబ్బంది మద్దతు సైతం పల్లాకు లభించింది. ఇదంతా ఓ భాగమైతే ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలడంతో, అధికార పార్టీ తన ఓట్లను నిలబెట్టుకోవడంతో పల్లా విజయం ఖరారైంది. మొదటి ప్రాధాన్యంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,10,840 ఓట్లు రాగా; మల్లన్నకు 83,290 కోదండరామ్‌కు 70,072 ఓట్లు వచ్చాయి. వీరితోపాటు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 39,107, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 27,588, సీపీఐ అభ్యర్థి జయసారధిరెడ్డికి 9577; ఇలా ఎక్కడికక్కడ చీలిపోయాయి. ఆది నుంచి అంతం వరకు పల్లా స్వయంగా అన్నీ విషయాలను ఆపరేట్‌ చేస్తూ తాను విజయం సాధిస్తానని, రెండో స్థానంలో తీన్మార్‌ మల్లన్న ఉంటారని కౌంటింగ్‌ మొదటి రోజే ‘ఆంధ్రజ్యోతి’తో స్పష్టం చేశారు. కాగా, విజయం అనంత రం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి జగదీ్‌షరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రముఖ నేతలు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా పల్లాకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం, శాలువా కప్పి సన్మానించారు.

పల్లాకు ధ్రువీకరణ పత్రం అందజేత

నల్లగొండ టౌన్‌:వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్‌ అధికారి,కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఆదివారం కౌటింగ్‌ కేంద్రం వద్ద అందచేశారు. ఈసందర్భంగా పలువురు పల్లాకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2021-03-22T06:23:59+05:30 IST