బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2021-11-21T06:37:00+05:30 IST

బాలల హక్కుల పరిరక్షణ ప్రతి పౌరని బాధ్యత అని జి ల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారి సైదులు అన్నారు.

బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
సమావేశంలో మాట్లాడుతున్న పీడీ కృష్ణవేణి

మోటకొండూరు, నవంబరు 20: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి పౌరని బాధ్యత అని జి ల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారి సైదులు అన్నారు. శనివారం మండల కేం ద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో యాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవా న్ని నిర్వహించి మాట్లాడారు. ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలు 1989లో బాలల హక్కుల తీర్మానాన్ని ఆమోదించాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ వడ్డెబోయిన శ్రీలత, తహసీల్దార్‌ రాము, హెచఎం రాఘురాంరెడ్డి, యాత్ర స్వచ్ఛంద సం స్థ డైరెక్టర్‌ సుర్పంగ శివలింగం, ఎస్‌ఎంసీ చైర్మన భూమాండ్ల రవీందర్‌, ఉపాధ్యాయులు, ప్రభాకర్‌రెడ్డి, వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-21T06:37:00+05:30 IST