నకిరేకల్ మునిసిపల్ చైర్మన్ పదవి టీఆర్‌ఎ్‌సకే
ABN , First Publish Date - 2021-05-08T06:24:57+05:30 IST
నకిరేకల్ మునిసిపాలిటీకి తొలి చైర్మన్, వైస్ చైర్‌పర్సన్ పదవులు టీఆర్‌ఎ్‌సకే దక్కాయి. 19వ వార్డు నుంచి గెలిచిన రాచకొండ శ్రీనివాస్ చైర్మన్‌గా, 11వ వార్డు నుంచి గెలిచిన మురారిశెట్టి ఉమారాణి వైస్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నకిరేకల్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మధ్యా హ్నం 3గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

తొలి చైర్మన్‌గా రాచకొండ శ్రీనివాస్
వైస్ చైర్‌పర్సన్‌గా ఉమారాణి
ఏకగ్రీవంగా ఎన్నిక
కొలువుదీరిన నూతన పాలకవర్గం
నకిరేకల్, మే 7: నకిరేకల్ మునిసిపాలిటీకి తొలి చైర్మన్, వైస్ చైర్‌పర్సన్ పదవులు టీఆర్‌ఎ్‌సకే దక్కాయి. 19వ వార్డు నుంచి గెలిచిన రాచకొండ శ్రీనివాస్ చైర్మన్‌గా, 11వ వార్డు నుంచి గెలిచిన మురారిశెట్టి ఉమారాణి వైస్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నకిరేకల్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మధ్యా హ్నం 3గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎ్‌స కు చెందిన వార్డు కౌన్సిలర్లు 11మంది, ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ కి చెందిన ఆరుగురు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు, ఒక ఇండిపెండెంట్ హాజరయ్యారు. వీరితో పాటు ఎక్స్‌అఫీషియో ఓటు నమోదు చేసుకున్న టీఆర్‌ఎ్‌సకు చెంది న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కరీంనగర్ ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతారావు హాజరయ్యారు. సమావేశంలో తొలుత 20వార్డుల కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చే యించారు. అనంతరం ఎన్నికకు సన్నద్ధమవుతుండగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయ ణ, ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతారావు ఎక్స్ అఫీషియో ఓట్లు వేశారని, కాంగ్రె్‌సకు చెందిన కౌన్సిలర్ దైద స్వప్న, గాజు ల సుకన్య అభ్యంతరం తెలపడంతో వీరిద్దరి ఓట్లను ఎన్నికల అధికారులు తొలగించారు.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఒక్కరి ఎక్స్ అఫీషియో ఓటు చెల్లుబాటవుతుందని అధికారులు ప్రకటించారు. 3.30గంటలకు తిరిగి ఎన్నిక ప్రారంభించగా, టీఆర్‌ఎ్‌స కు చెందిన రాచకొండ శ్రీనివా్‌సను చైర్మన్‌గా 2వ వార్డు కౌన్సిలర్ రాచకొండ సునిల్ ప్రతిపాదించగా 17వ వార్డు కు చెందిన పల్లె విజయ్ బలపరిచారు. వైస్ చైర్‌పర్సన్‌గా మురారిశెట్టి ఉమారాణిని 10వ వార్డు కౌన్సిలర్ చౌగో ని అఖిల ప్రతిపాదించగా, 14వ వార్డు కౌన్సిలర్ గడ్డం లక్ష్మినర్సింహస్వామి బలపర్చారు. చైర్మన్, వైస్ చైర్‌పర్సన్‌కు ఒకటి చొప్పున నామినేషన్లు రాగా, వీరిద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, నల్లగొండ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం చైర్మన్,వైస్ చైర్‌పర్సన్‌తో ప్రమాణస్వీకారం చేయించి, నియామక పత్రా లు అందజేశారు. రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్, ఎన్నికల పరిశీలకురాలు వాకాటి కరుణ పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరిగింది. ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నల్లగొండ డీఎస్పీ వెం కటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.