పోలీసులు లక్ష్యంతో పని చేయాలి

ABN , First Publish Date - 2021-11-28T06:01:09+05:30 IST

పోలీసులు లక్ష్యంతో పనిచేసి ఫిర్యాదుదారులకు సేవలందించాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నా రు. సూర్యాపేటరూరల్‌ పోలీ స్‌ స్టేషన్‌ను ఆయన శనివా రం ఆకస్మికంగా తనిఖీచేశా రు.

పోలీసులు లక్ష్యంతో పని చేయాలి
సూర్యాపేటరూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేటరూరల్‌, నవంబరు 27: పోలీసులు లక్ష్యంతో పనిచేసి ఫిర్యాదుదారులకు సేవలందించాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నా రు. సూర్యాపేటరూరల్‌ పోలీ స్‌ స్టేషన్‌ను ఆయన శనివా రం ఆకస్మికంగా తనిఖీచేశా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీ్‌సస్టేషన్‌లో పోలీస్‌ 5-ఎస్‌ అమలతోపాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులు, కేసు దర్యాప్తులను పెం డింగ్‌లో పెట్టవద్దని సిబ్బందికి సూచించారు. పెట్రోలింగ్‌, బ్లూకోట్స్‌ సిబ్బంది సేవల ను ప్రజలకు వేగంగా అందించాలన్నారు. పెట్రోలింగ్‌ కార్లను ఉద్దేశించిన పనులకు మాత్రమే ఉపయోగించాలన్నారు. వివిధ కేసుల్లో నేరస్థులకు శిక్షలు అమలయ్యేలా పోలీసులు పని చేయాలన్నారు. పోలీసులు, సిబ్బంది అందరూ లక్ష్యంతో ముందుకు వెళ్లాలని, ఎవరికి  కేటాయించిన పనిని వారు సక్రమంగా నిర్వహిస్తే పెండింగ్‌ కేసు లు, ఫిర్యాదులు ఉండవన్నారు. దర్యాప్తులో ఉన్న కేసులు, కోర్టు పెండింగ్‌ కేసులు, పిటిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను పరిశీలించి సీడీ పైల్స్‌ను పరిశీలించారు. ఎస్పీవెం ట సూర్యాపేటరూరల్‌ సీఐ విఠల్‌రెడ్డి, ఎస్‌ఐలులవకుమార్‌, సైదమ్మ,సిబ్బంది ఉన్నారు.  

Updated Date - 2021-11-28T06:01:09+05:30 IST