నకిరేకల్‌లో గులాబీ జెండా ఎగరాలి

ABN , First Publish Date - 2021-04-23T07:00:33+05:30 IST

నకిరేకల్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని, అందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

నకిరేకల్‌లో గులాబీ జెండా ఎగరాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి

విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి

నకిరేకల్‌, ఏప్రిల్‌ 22: నకిరేకల్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని, అందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. నకిరేకల్‌లో గురువారం సాయంత్రం జరిగిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మునిసిపాలిటీలోని 20 వార్డులను మొత్తం గెలిపించాలన్నారు. ఏ ఎన్నికలో అయినా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టే గెలుస్తుందన్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే నకిరేకల్‌ మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, నకిరేకల్‌, తుంగతుర్తి ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకుడు రాచకొండ శ్రవణ్‌ మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

Updated Date - 2021-04-23T07:00:33+05:30 IST