యాదాద్రిక్షేత్రంలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2021-12-19T05:38:15+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతంకా వడంతో వివిధ ప్రాంతాలనుంచి యాత్రీకులు పెద్దసంఖ్యలో క్షేత్ర సందర్శనకు విచ్చేసి ఇష్టదైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నా రు.

యాదాద్రిక్షేత్రంలో భక్తుల సందడి
బాలాలయంలో నిత్య తిరుకల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

స్వామివారి నిత్యాదాయం రూ.13.15లక్షలు


యాదాద్రి టౌన్‌, డిసెంబరు 18: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతంకా వడంతో వివిధ ప్రాంతాలనుంచి యాత్రీకులు పెద్దసంఖ్యలో క్షేత్ర సందర్శనకు విచ్చేసి ఇష్టదైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నా రు. కొండకింద తులసీకాటేజ్‌లోని స్వామివారి కల్యాణకట్టలో మొక్కు తలనీలాలు సమర్పించుకున్న భక్తులు తాత్కాలిక షవర్లకింద పుణ్యస్నానాలు ఆచరించారు. శివకేశవుల దర్శనాలు.. మొక్కు పూజల నిర్వహణ కోసం ప్రైవేటు ఆటోలు, ఆర్టీసీ, దేవస్థాన బస్సులలో కొండపైకి చేరుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనాలు.. ఆర్జిత నిర్వహణకోసం క్యూలైన్ల లో గంటల తరబడి వేచి ఉన్నారు. స్వామి ధర్మదర్శనాలకు మూడు గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. బాలాలయంలో నిత్య కల్యాణోత్సవం, ఆర్జిత సేవలు, కొండకింద పాత గోశాలలోని వ్రత మండపంలో సత్యనారాయణ వ్రతపూజల్లో భక్తులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా స్వామికి నిత్య పూజలు.. ప్రభాతవేళ మార్ఘళి పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయంలో కవచమూర్తులను కొలిచారు. బాలాలయ కల్యాణమండపంలో ఆండాల్‌ అమ్మవారిని కొలుస్తూ తిరుప్పావై పాశురపఠ నం జరిపిన ఆచార్యులు పాశుర వైభవాన్ని భక్తులకు వివరించారు. అనంతరం ఉత్సవమూర్తులను అభిషేకించి తులసీదళాలతో అర్చించి హోమం, నిత్యకల్యాణపర్వాలను ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. ఆలయంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు, వ్రతమండపంలో సత్యదేవుడి వ్రతపూజలు కొనసాగాయి. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి, ఉపాలయంలో చరమూర్తులకు నిత్యపూజలు స్మార్త సంప్రదాయరీతిలో కొనసాగాయి. వివిధ విభాగాల ద్వారా రూ.13,15,987 ఆదా యం దేవస్థాన ఖజానాలో జమయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది లా ఉంటే యాదాద్రిక్షేత్రాన్ని సందర్శించిన భక్తులు పోగొట్టుకున్న బంగారు నెక్లె్‌సను నిజాయితీగా తిరగి భక్తులకు అందజేసిన హోమ్‌ గార్డులు మమత, రవిలను ఈవో గీతారెడ్డి ఘనంగా సన్మానించారు.  


నేడు యాదాద్రిలో అఖిల భారతీయ బ్రాహ్మణ నిత్యాన్నసత్రం పారంభం

యాదగిరిగుట్ట పట్టణంలో అఖిల భారత భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నసత్రం ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.వేణుగోపాల్‌ శనివారం ప్రకటనలో తెలిపారు. సుమారు పన్నెండు క్షేత్రాల్లో వివిధ అన్నదాన, గోశాల, వేదపాఠశాలలు, వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేసినట్లు, యాదాద్రిక్షేత్రంలో బ్రాహ్మణ నిత్యాన్నసత్రాన్ని ఆదివారం ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. 


 పాతగుట్టలో ఈ నెల 22న సహస్ర గళార్చన

యాదాద్రి దేవస్థాన అనుబంధ ఆలయమైన పాతగుట్ట ప్రాంగణం లో ఈ నెల 22వ తేదీన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సహస్ర గళార్చన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శనివారం ప్రకటన ద్వారా తెలిపారు. పాతగుట్ట ఆలయ ప్రాంగణంలోని ఎస్‌వీఆర్‌, ఎస్‌కేఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో సుమారు వెయ్యి మంది గాయనీగాయకులచే గోవిందుడికి స్వరాభిషేకం (సహస్రగళార్చన) కార్యక్రమం నిర్వహించనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్‌ కేవీ రమణాచారి, దేవస్థాన ఈవో గీతారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-19T05:38:15+05:30 IST