28న మార్కెట్ పాలకవర్గం ప్రమాణస్వీకారం
ABN , First Publish Date - 2021-08-25T06:59:26+05:30 IST
మోత్కూరు వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ఈ నెల 28న ప్రమాణ స్వీకారం చేస్తుందని అడ్డగూడూరు మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

మోత్కూరు, ఆగస్టు 24: మోత్కూరు వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ఈ నెల 28న ప్రమాణ స్వీకారం చేస్తుందని అడ్డగూడూరు మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. అడ్డుగూడూరులో మంగళవారం నిర్వహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోత్కూరు మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ సభకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ హాజరవుతున్నందున అడ్డగూడూరు నుంచి టీఆర్‌ఎస్ నాయ కులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, సర్పంచ్ బాలెంల త్రివేణిదుర్గయ్య, మార్కెట్ మాజీ చైర్మన్లు తీపిరెడ్డి మేఘారెడ్డి, చిప్పలపల్లి మహేంద్రనాథ్, జడ్పీ కోఆప్షన్ సభ్యు డు గుండిగ జోసెఫ్, మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ కొణతం యాకూబ్‌రెడ్డి, డైరెక్టర్ కంచర్ల చలపతిరెడ్డి, శ్రీరాముల అయోధ్య, పూలపల్లి జనార్దన్‌రెడ్డి, గూడెపు పరమేష్ తదితరులు పాల్గొన్నారు.