చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-09-03T06:25:35+05:30 IST

చికిత్స పొందుతున్న వ్యక్తి గురువారం మృతి చెందాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

మర్రిగూడ, సెప్టెంబరు 2: చికిత్స పొందుతున్న వ్యక్తి గురువారం మృతి చెందాడు. ఎస్‌ఐ నాగుల్‌మీరా తెలిపిన వివరాల ప్రకారం కమ్మగూడ గ్రామపంచాయతీ పరిధిలోని బీమ్లాతండాకు చెందిన రమావత్‌ శ్రీను(40) ఆగస్టు 18న తన ఇంటి  వద్ద పశువులను కట్టే స్తుండగా అతడిని పశువు ఢీకొట్టడంతో కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో చికిత్సనిమిత్తం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీను గురువారం మృతిచెందాడు. శ్రీను భార్య బుజ్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. శ్రీనుకు ఇద్దరు భార్యలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 

Updated Date - 2021-09-03T06:25:35+05:30 IST