విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-05-21T06:44:36+05:30 IST
భూదాన్‌పో చంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామపంచాయతీ శివారుగ్రామమైన మామిళ్లగూడెంలో ఓ ప్రైవేటు ఎలక్ర్టీషియన్ విద్యుదాఘాతంతో గురువారం మృతిచెందాడు.

భూదాన్‌పోచంపల్లి, మే 20: భూదాన్‌పో చంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామపంచాయతీ శివారుగ్రామమైన మామిళ్లగూడెంలో ఓ ప్రైవేటు ఎలక్ర్టీషియన్ విద్యుదాఘాతంతో గురువారం మృతిచెందాడు. మిషన్ భగీరథ పథకం అమలులో ప్రైవేటు ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తున్న పర్సమోని రమేష్ (42) అనే వ్యక్తి గురువారం సాయంత్రం తన ఇంట్లోని వాటర్ సంప్‌లోని విద్యుత్ మోటార్ పనిచేయకపోవడంతో రిపేరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా రమేష్‌కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.