చిలుకల గోవర్ధన్‌ జీవితం స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2021-11-21T06:47:44+05:30 IST

చిలుకల గోవర్ధన్‌ జిల్లా రాజకీయాలపై చెదరని ముద్రవేసుకున్నారని ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

చిలుకల గోవర్ధన్‌ జీవితం స్ఫూర్తిదాయకం

 విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి 

నల్లగొండ క్రైం, నవంబరు 20 : చిలుకల గోవర్ధన్‌ జిల్లా రాజకీయాలపై చెదరని ముద్రవేసుకున్నారని ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. చిలుకల గోవర్ధన్‌ దశదిన కర్మకు ఆయన హాజరై స్థానిక నటరాజ్‌ థియేటర్‌లో ఏర్పాటు చేసిన గోవర్ధన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, మాట్లాడారు. నిబద్ధత ఆయన నైజమని, నిజాయితీ ఆయన చిరునామా అని అన్నారు. తండ్రి వారసత్వ రాజకీయాలను పునికిపుచ్చుకొని మూడు దఫాలుగా కౌన్సిలర్‌గా గెలిచి ప్రజాసేవలో ముందుకు సాగుతూ లయన్స్‌క్లబ్‌కు రెండు జిల్లాల గవర్నర్‌గా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. వ్యాపార రంగంలో కూడా రాణిస్తూ నటరాజ్‌ థియేటర్‌ నిర్మాణం ద్వారా ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ప్రవేశించి ఆ సంస్థకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై జిల్లా ఖ్యాతిని విస్తరించారన్నారు. అమెరికాలో సీఎం కేసీఆర్‌ పాలనను ఖండాంతరాలకు వ్యాపించే ప్రక్రియలో చిలుకల గోవర్ధన్‌ ముందు వరుసలో ఉండటమే కాకుండా తన వెంట అమెరికాలో జరిగిన ప్రవాస తెలంగాణ వాసుల సమావేశంలో భాగస్వామ్యం అయ్యారన్నారు. కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, ఎంజీయూ ఈసీ మెంబర్‌ కృష్ణారెడ్డి, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ రమే్‌షగౌడ్‌, చిలుకల గోవర్థన్‌ భార్య భాగ్యలక్ష్మీ, కుమారులు, కోడళ్లు లక్ష్మీనర్సింహరావు, శారద, పాండురంగారావు, గీత, వెంకటరమణరావు స్వప్న, వేణుగోపాల్‌రావు అరుణ, కూతురు అల్లుడు ఆకుల మహాలక్ష్మీ ఆంజనేయులు, మనుమరాలు ఆధ్యలక్ష్మీ, మనుమలు, టీఆర్‌ఎస్‌ నాయకులు బొర్ర సుధాకర్‌, సుంకరి మల్లేశ్‌గౌడ్‌, భోనగిరి దేవేందర్‌, మాలె శరణ్యారెడ్డి, సంకు ధనలక్ష్మీ, బకరం వెంకన్న, పిల్లి రామరాజు ఉన్నారు. 


Updated Date - 2021-11-21T06:47:44+05:30 IST