బాల విహార్‌కు తాళం

ABN , First Publish Date - 2021-12-19T05:44:50+05:30 IST

ఏపీ-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బాలవిహార్‌లో ఫర్టిలైజర్‌ డీలర్ల మందు, విందు వ్యవహారంపై కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన కొందరు ఫర్టిలైజర్‌ డీలర్లు బాలవిహార్‌ను అద్దెకు తీసుకొని మద్యం పార్టీ చేసు కున్నారు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పో

బాల విహార్‌కు తాళం
బాలవిహార్‌కు తాళం వేస్తున్న రెవెన్యూ అధికారులు

మందు, విందు వ్యవహారంపై కలెక్టర్‌ సీరియస్‌

ప్రైవేట్‌ వ్యక్తులకు ఎలా ఇస్తారని ఆగ్రహం 

నాగార్జునసాగర్‌, డిసెంబరు 18: ఏపీ-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బాలవిహార్‌లో ఫర్టిలైజర్‌ డీలర్ల మందు, విందు వ్యవహారంపై కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన కొందరు ఫర్టిలైజర్‌ డీలర్లు బాలవిహార్‌ను అద్దెకు తీసుకొని మద్యం పార్టీ చేసు కున్నారు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇక్కడ మద్యం తాగవద్దని, ప్రభుత్వ భవ నమని చెప్పారు. ఫూటుగా మద్యం తాగి ఉన్న ఫర్టిలైజర్‌ డీలర్లు కానిస్టేబు ళ్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. ‘తెలంగాణ మందు.. సరిహద్దులో విందు’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తకు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ స్పందించారు. ప్రభుత్వ కార్యాలయాలను ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వడమేంటని?, బార్‌లో మా దిరిగా మద్యం సేవించడమేమిటని జలవిహార్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బాలవిహార్‌ను ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే వాడుకో వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో పెద్దవూర తహసీల్దార్‌ సైదులుగౌడ్‌ ఆర్‌ఐ లక్ష్మీకాంత్‌ను సాగర్‌కు పంపించి బాలవిహార్‌కు తాళం వేయించారు. తాళాలను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. 

Updated Date - 2021-12-19T05:44:50+05:30 IST