ధాన్యాన్ని కేంద్రప్రభుత్వమే కొనాలి
ABN , First Publish Date - 2021-10-29T06:45:47+05:30 IST
కేంద్రప్రభుత్వం (ఎఫ్‌సీఐ) ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడం సరికాదని, కేంద్ర ప్రభుత్వమే ధాన్యాన్ని పూ ర్తిగా కొనుగోలు చేయాలని ఆయిల్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన కంచర్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

ఆయిల్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన రామకృష్ణారెడ్డి
మోత్కూరు, అక్టోబర్ 28: కేంద్రప్రభుత్వం (ఎఫ్‌సీఐ) ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడం సరికాదని, కేంద్ర ప్రభుత్వమే ధాన్యాన్ని పూ ర్తిగా కొనుగోలు చేయాలని ఆయిల్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన కంచర్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మోత్కూరు మార్కెట్లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు కూడా మూస పద్ధతిలో ఎప్పుడూ ఒకే పంటను వేయకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను వేయాలని సూచించారు. తిరుమలగిరి శుభమస్తు గార్డెన్సలో శ నివారం నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోత్కూరు, అడ్డగూడూరు మండలాల నుంచి ముఖ్య కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లాలో ఆయిల్‌ఫా మ్ సాగుకు కేంద్రం గ్రీనసిగ్నల్ ఇచ్చిందని, వారం, పది రోజుల్లో రాష్ట్ర ప్ర భుత్వం నుంచి కూడా అనుమతి లభిస్తుందన్నారు. సమావేశంలో మో త్కూరు మునిసిపల్ చైర్‌పర్సన తీపిరెడ్డి సావిత్రి, వైస్‌చైర్మన బొల్లెపల్లి వెంకటయ్య, అడ్డగూడూరు ఎంపీపీ దర్శనాల అంజయ్య, మార్కెట్ చైర్మన కొణతం యాకూబ్‌రెడ్డి, మాజీ చైర్మన్లు మేఘారెడ్డి, మహేందర్‌నాథ్, టీఆర్‌ఎస్ నాయకులు రమేష్, కల్యాణ్‌చక్రవర్తి, లక్ష్మి పాల్గొన్నారు.