నృత్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-06-21T05:49:09+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నృత్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా డ్యాన్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు బండారు వీరునాయుడు అన్నారు.

నృత్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
సూర్యాపేటలో బాలకేంద్రంలో డ్యాన్సర్లకు బియ్యం పంపిణీ చేస్తున్న బండారు వీరునాయుడు

సూర్యాపేట అర్బన్‌, జూన్‌ 20 : కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నృత్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా డ్యాన్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు బండారు వీరునాయుడు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జవహర్‌ బాల కేంద్రం ఆవరణలో సంధ్యా హెల్ప్‌ హ్యాండ్స్‌ ఆధ్వర్యంలో డ్యాన్సర్లకు బియ్యాన్ని పంపిణీ చేసి మాట్లాడారు. 100 మంది డ్యాన్సర్ల కుటుంబాలకు 25 కేజీల బియ్యం చొప్పున పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాచర్ల ప్రదీప్‌, బాలకృష్ణ, రాజిరెడ్డి, ప్రశాంత్‌, అనిల్‌, సాయిచరణ్‌, మధు, డ్యాన్సు మాస్టర్లు మ్యాడీ, రవి, నివేదిత పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T05:49:09+05:30 IST