చేనేత వస్త్ర నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి
ABN , First Publish Date - 2021-05-05T06:20:23+05:30 IST
చేనేత వస్త్ర ఉత్పత్తి దారుల వద్ద పేరుకుపోయిన వస్త్ర నిల్వలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని పద్మశాలి సంఘం నాయకులు కోరారు.

భూదాన్‌పోచంపల్లి, మే 4 : చేనేత వస్త్ర ఉత్పత్తి దారుల వద్ద పేరుకుపోయిన వస్త్ర నిల్వలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని పద్మశాలి సంఘం నాయకులు కోరారు. ఈమేరకు సంఘం నాయకులు మంగళవారం భూదాన్‌పోచంపల్లి తహసీ ల్దార్ దశరథనాయక్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. వస్త్ర ఉత్పత్తిదారుల వద్ద నిల్వలు పేరుకుపోయి నందున కార్మికులకు పనికల్పించలేని అచేతన స్థితిలో ఉన్నామని తెలిపారు. మగ్గాలు నెలరోజలు పాటు బంద్ పెడుతున్నామని పేర్కొన్నారు. ఉత్పత్తిదా రుల కు ప్రభుత్వ పూచీకత్తుపై రూ.25లక్షల వరకు బ్యాంకు రుణాలు ఇప్పించాలని, 40శాతం సబ్సిడీని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా సులభ తరమైన విధంగా ప్రతినెలా చేనేత కార్మికులకు అందించాలని కోరారు. చేనేతకు జీఎస్టీని తక్షణమే తొలగించాలని కోరారు. చేనేతకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వెయ్యికోట్లు కేటాయించి, చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీశైలం, ఉపాధ్యక్షుడు వనం బుచ్చిదాసు, ప్రధాన కార్యదర్శి కడవేరు చం ద్రశేఖర్, నాయకులు ఆడెపు ఆంజనేయులు, రాపోలు శ్రీనివాస్, ఏలె పాండు, మేకల రామకృష్ణ, రుద్ర చెన్నకేశవులు, కుడికాల బలరాం, నక్క రాంచంద్రం, కె.నరహరి, నర్సింహ పాల్గొన్నారు.