మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం
ABN , First Publish Date - 2021-12-15T07:01:47+05:30 IST
రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్ విమర్శించారు.

టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్
సూర్యాపేటౌన్, డిసెంబరు 14: రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్ విమర్శించారు. సూర్యాపేటలో రోడ్లకు మరమ్మతు చేయాలని కోరుతూ స్థానిక కొత్త బస్‌స్టేషన్ సమీపంలో మంగళవారం నిరసన దీక్ష చేశారు. అధ్యానంగా ఉన్న సూర్యాపేట నియో జకవర్గంలోని రోడ్లపై ప్రయాణించడానికి మంత్రి జగదీష్‌రెడ్డి వస్తారా? అని ఆయన సవాల్ విసిరారు. కమీషన్ కోసమే నియోజకవర్గంలో కొత్త పనులకు శంకుస్థాపన చేస్తూ తర్వాత పట్టించుకోవడంలేదనాన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజి ఏర్పాటును ప్రతీ ఒక్కరు స్వాగతిస్తున్నారని, అదే సమయంలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ప్రచారం మినహా అభివృద్ధి శూన్యమన్నారు. రోడ్లకు మరమ్మతు చేయనట్లయితే మంత్రి ఇంటిని త్వరలో ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈదీక్షకు సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, మలమహానాడు, కాంగ్రెస్ సేవాదళ్, గిరిజన శక్తి నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మండారి డేవిడ్‌కుమార్, ఎర్రమల్ల రాములు, అన్నపూర్ణ, కొత్తపల్లి శివకుమార్, గండూరి రమేష్, బుద్ద సత్యనారాయణ, చామకూరి నర్సయ్య, వెంకటేష్ నాయక్, గట్ల రమాశంకర్, మాండ్ర మల్లయ్యయాదవ్, నారబోయిన కిరణ్, బంధన్‌నాయక్, వినయ్‌గౌడ్, కారింగుల వెంకన్న, కునుకుంట్ల సైదులు, అశోక్, గుండాల సందీప్, శ్రీకాంత్‌వర్మ, వీరబోయిన లింగయ్య, కొత్తపల్లి రేణుక, కృష్ణ, బచ్చలకూరి గోపి, సూర్యనారాయణ, రఫీ, శ్రీను, సతీష్, ఈశ్వర్‌సింగ్, శివ, హరీష్, స్వామిగౌడ్, రమేష్, నవీన్ పాల్గొన్నారు.