సాగర్ ఆయకట్టులో రబీ పంటను ఆపే హక్కు ప్రభుత్వానికి లేదు
ABN , First Publish Date - 2021-10-28T05:49:46+05:30 IST
యాసంగిలో వరి పంట సాగు చేయ వద్దని ప్రభుత్వం ప్రకటించేందుకు అర్హత లేదని రైతు సంఘం నాయ కులు, గుడిబండ మాజీ సర్పంచ్ తూమాటి వరప్రసాద్‌రెడ్డి అన్నారు. గు

రైతు సంఘం నాయకుడు తూమాటి వరప్రసాద్‌రెడ్డి
కోదాడ రూరల్, అక్టోబరు 27 : యాసంగిలో వరి పంట సాగు చేయ వద్దని ప్రభుత్వం ప్రకటించేందుకు అర్హత లేదని రైతు సంఘం నాయ కులు, గుడిబండ మాజీ సర్పంచ్ తూమాటి వరప్రసాద్‌రెడ్డి అన్నారు. గుడిబండలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే ఖరీఫ్, రబీ పంటలు సాగుకు వీలుగా రూపకల్పన చేశారన్నారు. ఆనాటి నుంచి ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు రెండు పంటలకు విడుదల చేస్తున్నారని, నీరు తక్కువగా ఉన్న సమయంలో మాత్రం తక్కువగా విడుదల చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో గరిష్టస్థాయిలో నీటిమ్టం ఉందన్నారు. నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు ప్రభుత్వం వరి పంటను సాగు చేయవద్దని చెప్పే హక్కు లేదన్నారు.ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. సాగర్ ఎడమకాల్వ పరిధిలోని మొదటి జోన్ పరిధి వరకు మెట్టపంటలు వేసుకునే అవకాశమే లేదన్నారు. ఇప్పటికే వానాకాలం సీజన్ వరి పంట కోతకు వచ్చి రైతులు రబీ పంటకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వ ప్రకటనలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. కార్యక్రమంలో పలువురు రైతులు, రైతుసంఘం నాయకులు పాల్గొన్నారు.