సర్వమతాల సారాంశం ఒక్కటే

ABN , First Publish Date - 2021-12-07T07:05:55+05:30 IST

సర్వమతాల సారాంశం ఒక్కటేనని టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ జావేద్‌ అన్నారు.

సర్వమతాల సారాంశం ఒక్కటే

 అయ్యప్ప భక్తులకు అన్నదానం చేసిన ముస్లింలు

మిర్యాలగూడ టౌన్‌, డిసెంబరు 6: సర్వమతాల సారాంశం ఒక్కటేనని టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ జావేద్‌ అన్నారు. అయ్యప్ప మాలాధారణ చేసిన స్వాములకు ముస్లిం యూత్‌ సభ్యులతో కలిసి సోమవారం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణం మత సామరస్యానికి పుట్టినిల్లు లాంటిదన్నారు. మతాలు వేరైనా ఈశ్వర్‌, అల్లా, ఏసు బోఽధనలు సూచించేది ఒక్కటేనని, సోదరభావంతో మెలగాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో జునాయిద్‌, ముబీన్‌, గౌస్‌, నాగేంద్ర, నవీన్‌, సూర్య, గోపి, రాము, వెంకట్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-12-07T07:05:55+05:30 IST