ఎన్నికను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-12-09T06:03:22+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ అన్నారు.

ఎన్నికను పకడ్బందీగా నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న యాదాద్రి జిల్లా కలెక్టర్‌, డీసీపీ

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌

భువనగిరి రూరల్‌, డిసెంబరు 8 : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీసీపీలతో బుధవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో కొవిడ్‌ మార్గదర్శకాలు పాటించాలని సూచించాలరు. భౌతికదూరం, మాస్క్‌లు, శానిటైజర్లు వినియోగించాలన్నా రు. పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించకూడదన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రి, పోలింగ్‌ అనంతరం తిరిగి బ్యాలెట్‌ బాక్సులను పటిష్ఠ బందోబస్తు నడుమ తరలించాలన్నారు. ఓటర్‌ గుర్తింపు కార్డు లేదా ఎన్నికల సంఘం సూచించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉంటేనే ఓటర్లను ఓటు వేసేందుకు అనుమతించాలన్నారు. పోలింగ్‌ కేంద్రంలో ఇచ్చే వాయిలెట్‌ పెన్నుతోనే బ్యాలెట్‌ పేపరుపై ప్రాధాన్య క్రమంలో అంకెలు వేసేలా ఓటర్లకు సూచించాలని, ప్రతీ కేంద్రం వద్ద హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా పోలింగ్‌ కేందాల వద్ద ఏఎన్‌ంఎలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈనెల 14న కౌంటింగ్‌ ప్రక్రియను సైతం పకడ్బందీగా నిర్వహించాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పమేలాసత్పథి, అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, డీసీపీ కె.నారాయణరెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T06:03:22+05:30 IST