యాదాద్రి దేవాలయ అభివృద్ధిలో నిర్లక్ష్యం తగదు

ABN , First Publish Date - 2021-08-25T06:45:39+05:30 IST

యాదాద్రి దేవాలయం అభివృద్ది విషయంలో నిర్లక్ష్యం తగదని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అ న్నారు. యాదాద్రి సీపీఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహిం చిన ఏఐవైఎఫ్‌ మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

యాదాద్రి దేవాలయ అభివృద్ధిలో నిర్లక్ష్యం తగదు
గుట్ట సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు

యాదాద్రి రూరల్‌, ఆగస్టు 24: యాదాద్రి దేవాలయం అభివృద్ది విషయంలో నిర్లక్ష్యం తగదని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు. యాదాద్రి సీపీఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన  ఏఐవైఎఫ్‌ మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల విరమణతో దేవస్థానంలో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయడంలో అధి కారులు నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారన్నారు. రోడ్డు విస్తరణలో నష్టపోయిన బాధితులకు న్యాయపరమైన పరిహారం అందించాలన్నారు.  ఏఐవైఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ పేరబోయిన మహేందర్‌ మాట్లాడుతూ యాదాద్రికి రింగ్‌రోడ్డు లోపల ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు రోడ్డు కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పుల్లె నరేష్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి బబ్బూరి శ్రీనివాస్‌, నాయకులు  పి.వెంకటేష్‌, బండ రాంచందర్‌, శెట్టి నర్సింహ, పేరబోయిన మహేష్‌, అనంతుల నర్సింహ,  రాజు, పాల రాజు, కంబాల రాజు, సందీప్‌ పాల్గొన్నారు.

ఏఐవైఎఫ్‌ మండల కమిటీ అధ్యక్షుడిగా  వెంకటేష్‌

ఈ సందర్భంగా ఏఐవైఎఫ్‌ మండల నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కంబాల వెంకటేష్‌, కార్యదర్శిగా పుల్లె నరేష్‌, ఉపాధ్యక్షుడిగా కోనేరి శ్రీనివాస్‌, సహాయ కార్యదర్శిగా తోటకూరి శేఖర్‌, మరో ఎనిమిది మందిని కార్యవర్గ సభ్యులుగా  ఎన్నుకున్నారు.




Updated Date - 2021-08-25T06:45:39+05:30 IST