దేవరకొండ డిపో ఆదర్శంగా నిలవాలి

ABN , First Publish Date - 2021-11-09T06:57:32+05:30 IST

ఆదాయంలో దేవరకొండ ఆర్టీసీ డిపో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉంచేలా ఆర్టీసీ ఉద్యోగులందరూ కృషి చేయాలని టీఎస్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యాదగిరి అన్నారు.

దేవరకొండ డిపో ఆదర్శంగా నిలవాలి

- టీఎస్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యాదగిరి 

దేవరకొండ, నవంబరు 8:  ఆదాయంలో దేవరకొండ ఆర్టీసీ డిపో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉంచేలా ఆర్టీసీ  ఉద్యోగులందరూ కృషి చేయాలని టీఎస్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యాదగిరి అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి దేవరకొండకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి దేవరకొండ డిపోకు చేరుకున్నారు. మొదటగా బస్టాండ్‌లో కార్గోపార్సల్‌ వివరాలను అడిగి తెలుసుకొని డిపోను సంద ర్శించి ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.  దేవరకొండ డిపోకు రాష్ట్రస్థాయిలో మంచిపేరు ఉందని, ఎన్నో అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. దేవరకొండ డిపోను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సమావేశంలో డిపో మేనేజర్‌ రాజీవ్‌ ప్రేమ్‌కు మార్‌, ఆర్టీసీ అధికారి మధుసూదన్‌, దేవరకొండ డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ సైదులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-09T06:57:32+05:30 IST