‘వరికి ఉరి’ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: జూలకంటి

ABN , First Publish Date - 2021-11-09T06:51:14+05:30 IST

వరి వేస్తే ఉరి అనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు.

‘వరికి ఉరి’ నిర్ణయాన్ని  ఉపసంహరించుకోవాలి: జూలకంటి
నల్లగొండ రూరల్‌, నవంబరు 8 : వరి వేస్తే ఉరి అనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో సోమవారం జరిగిన సీపీఎం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం వరి పంట వేయొద్దని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  వేసవిలో ఏ పంటలు సేద్యం చేయాలో భూ పరీక్షలు చేయకుండా హుటాహుటిన రబీ సీజన్లో పంటలు మార్పిడి చేయడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ముందస్తు వ్యవసాయ ప్రణాళిక లేకపోవడంతోనే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. సమావేశంలో సీపీఎం  జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, డి.మల్లేషం, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, కున్‌రెడ్డి నాగిరెడ్డి  పాల్గొన్నారు.


Updated Date - 2021-11-09T06:51:14+05:30 IST