‘దళితబంధు’ను రాష్ట్రం మొత్తం అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-08-20T06:30:31+05:30 IST

ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

‘దళితబంధు’ను రాష్ట్రం మొత్తం అమలు చేయాలి

 సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి                            

నకిరేకల్‌, ఆగస్టు 19:  ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మండలంలోని మంగ ళపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన సీపీఎం గ్రామశాఖ మహాసభలో ఆయన మాట్లా డారు. సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని కేవలం హుజూరాబాద్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రకటించారని అన్నారు. ఈ పఽథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌చేశారు.  కట్టంగూరు మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్‌ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించేందుకు ప్రత్యేక బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు. సభలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందాళ ప్రమీళ, మండల కార్యదర్శి రాచకొండ వెంకట్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ మర్రి వెంకటయ్య,  కొప్పుల అంజయ్య, పైళ్ల లింగయ్య, మర్రి బక్కయ్య, ప్రకాష్‌రావు, లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం గ్రామశాఖ కార్యదర్శిగా మర్రి బక్కయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

Updated Date - 2021-08-20T06:30:31+05:30 IST