ఉప ఎన్నికలో కాషాయ జెండా ఎగరాలి

ABN , First Publish Date - 2021-03-21T07:16:21+05:30 IST

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కాషాయ జెండా ఎగరాలని మాజీ మంత్రి, బీజేపీ నేత రవీంద్ర నాయక్‌ అన్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేపట్టిన గిరిజన భరోసా పాదయాత్రను డాక్టర్‌ రవినాయక్‌ ఆధ్వర్యంలో శనివారం పెద్దవూర మండలంలోని జగ్రాం తండా నుంచి ప్రారంభించారు.

ఉప ఎన్నికలో కాషాయ జెండా ఎగరాలి
పాదయాత్ర ప్రారంభించి మాట్లాడుతున్న రవీంద్ర నాయక్‌

మాజీ మంత్రి, బీజేపీ నేత రవీంద్రనాయక్‌


పెద్దవూర, మార్చి 20: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కాషాయ జెండా ఎగరాలని మాజీ మంత్రి, బీజేపీ నేత రవీంద్ర నాయక్‌ అన్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేపట్టిన గిరిజన భరోసా పాదయాత్రను డాక్టర్‌ రవినాయక్‌ ఆధ్వర్యంలో శనివారం పెద్దవూర మండలంలోని జగ్రాం తండా నుంచి ప్రారంభించారు. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ పాదయాత్ర తొలిరోజు హుషారుగా సాగింది. ఈ సందర్భంగా రవీంద్రనాయక్‌ మాట్లాడుతూ, గిరిజనులకు మూడెకరాల భూమితోపాటు, 10శాతం రిజర్వేషన్లు, పోడు భూముల సమస్యల పరిష్కారానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుతున్నారని, అందులో భాగంగానే దుబ్బా క, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారని, త్వరలో జరగబోయే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో బీజేపీ విజయం తథ్యమన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, రిక్కల ఇంద్రసేనారెడ్డి, చెన్ను వెంకటనారాయణరెడ్డి, దినే్‌షనాయక్‌, సక్రునాయక్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే భరోసా యాత్రలో డాక్టర్‌ రవినాయక్‌ ప్లెక్సీలు, జెండాల్లో జిల్లా అధ్యక్షుడి ఫొటో లేదని కంకణాల శ్రీధర్‌రెడ్డి అలకబూని మధ్యలోనే వెళ్లిపోయారు. 

Updated Date - 2021-03-21T07:16:21+05:30 IST