వేడి నీళ్ల బకెట్‌లో పడి చిన్నారి మృతి

ABN , First Publish Date - 2021-01-13T06:14:13+05:30 IST

ఆడుకునేందుకు పక్క ఇంటికి వెళ్లిన చిన్నారి వేడి నీళ్ల బకెట్‌లో పడి మృతి చెందింది. ఈ విషాద ఘటన నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామంలో జరిగింది.

వేడి నీళ్ల బకెట్‌లో పడి చిన్నారి మృతి
నక్షత (ఫైల్‌)

నల్లగొండ మండలం దోమలపల్లిలో విషాదం

నల్లగొండ క్రైం, జనవరి 12: ఆడుకునేందుకు పక్క ఇంటికి వెళ్లిన చిన్నారి వేడి నీళ్ల బకెట్‌లో పడి మృతి చెందింది.   ఈ విషాద ఘటన నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామంలో జరిగింది.  నల్లగొండ రూరల్‌ ఎస్‌ఐ ఏమి రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దోమలపల్లి కి చెందిన నారపాక నర్సింహ కుమార్తె నక్షత్ర(3) సోమ వారం సాయంత్రం అడుకునేందుకు పక్కనే ఉన్న ఇంటికి వెళ్లింది. ప్రమాదవశాత్తు వేడి నీటి బకెట్‌లో పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని చికిత్స నిమిత్తం హైద రాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తండ్రి నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.Updated Date - 2021-01-13T06:14:13+05:30 IST