పల్లెలకు ప్రకృతి శోభ

ABN , First Publish Date - 2021-08-10T05:54:25+05:30 IST

ఉపాధిహామీ పథకంలో ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకం గా చేపట్టిన పల్లె ప్రకృతి వనాల పెంపకం గ్రామాలకు కొత్త శోభ, ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి.

పల్లెలకు ప్రకృతి శోభ
మోత్కూరు మండలం పొడిచేడులోని పల్లె ప్రకృతి వనం

వర్షాలతో ప్రకృతి వనాల్లో ఏపుగా పెరుగుతున్న మొక్కలు

ఉమ్మడి జిల్లాలో 32.70లక్షల మొక్కలు

రూ.11.83లక్షల వ్యయం

(మోత్కూరు)

ఉపాధిహామీ పథకంలో ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకం గా చేపట్టిన పల్లె ప్రకృతి వనాల పెంపకం గ్రామాలకు కొత్త శోభ, ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. ప్రభుత్వం పం చాయతీలకు ఓ ట్రాక్టర్‌, వాటర్‌ ట్యాంకర్‌ను సమకూర్చడంతో గత వేసవి నుంచే మొక్కలకు నీరుపోయిస్తూ సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు వాటిని కాపాడు తూ వచ్చారు. అంతేగాక ఇటీవల కురిసిన వర్షాలతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. అధికారులు నిత్యం సందర్శించి పర్యవేక్షిస్తుండటంతో ఎక్కడైనా మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్తవి వెంటనే నాటుతున్నారు. ఈ మొక్కలు మరో రెం డు మూడేళ్ల లో పెరిగి పెద్దవి అయితే ప్రల్లె ప్రకృతి వనాలతో గ్రా మాలు నూతన శోభను సంతరించుకోనున్నాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 71మండలాల్లో 1720 పంచాయతీలు,854 హ్యాబిటేషన్లు ఉండగా, మొత్తం 2,574 ప్రకృతివనాలు పెంచుతున్నారు. అన్నింటిలో మొక్కలు నాట డం పూర్తయింది. ఒక్కో ప్రకృతి వనాన్ని కనీసం ఎకరం విస్తీర్ణంలో పెంచాల్సి ఉండగా, ప్రభుత్వ భూమి లభ్యత ప్రకారం ఎకరంలేదా, అంతకంటే తక్కువ, ఎక్కువ విస్తీర్ణంలో సైతం మొక్కలు పెంచుతున్నారు. ప్రతి ప్రకృతి వనం చుట్టూ రాతి కడీలు,ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు.దీంతో జీవాల నుంచి వా టికి రక్షణ కల్పించినట్టయింది. అంతేగాక, ప్రకృతి వనంలో ట్రాక్టర్‌ తిరిగేలా, మధ్యలో రెండు పెద్ద దారులు తీశారు.

32.70లక్షల మొక్కల పెంపకం

ఉమ్మడి జిల్లాలోని పల్లె ప్రకృతి వనాల్లో 32,70,395 మొక్కలు నాటారు. యాదాద్రి జిలాల్లోని 17 మండలాలు, 418 పంచాయతీలు, 185 హ్యాబిటేషన్లలో 6,95,685 మొక్కలు నాటారు. అందుకు రూ.2,52,26,775 వ్యయం చేశారు. నల్లగొండ జిల్లాలోని 31 మండలాలు, 827 పంచాయతీలు, 465 హ్యాబిటేషన్లలో 17,11,220 మొక్కలు నాటారు.  అందుకు రూ.5,82,50,648 కూలీలకు చెల్లింపులు చేశారు. సూర్యాపేట జిల్లాలో 23 మండలాల్లో 475 పంచాయతీలు, 204 హ్యాబిటేషన్లలో 8,63,490 మొక్కలు నాటగా, కూలీలకు రూ.3,18,21,281 ఖర్చయింది. మొత్తం ఉమ్మడి జిల్లాలో రూ.11,52,98,704 కూలీలకు చెల్లించారు. సామగ్రి కోసం యాదాద్రి జిల్లాలో రూ.1,48,934, నల్లగొండ జిల్లాలో రూ.15,22,291, సూర్యాపేట జిల్లాలో రూ.13,80,311 చొప్పున మొత్తం రూ.30,51,536 సామగ్రి కోసం ఖర్చు చేశారు. 

నాలుగు వేల మొక్కలకు ఒక్కడే సంరక్షకుడు

పల్లె ప్రకృతి వనంలో ఎకరానికి సుమారు నాలుగు వేల మొక్కలు నాటారు. జామ, దానిమ్మ, బొప్పాయి, ఉసిరి, సీతాఫలం, చింత, వేప, ఫెల్టోఫామ్‌, మందార, అడవితంగేడు, తులసి, కోనోకార్పస్‌, గన్నేరు మొక్కలు నాటారు. అయితే నాలుగువేల మొక్కలకు ఒకే సంరక్షకుడిని నియమించారు. అతడికి రోజుకు రూ.245 కూలి చొప్పున చెల్లిస్తున్నారు. మొక్కలు పెంచడం, కలుపు తీయడం, ఎరువులు వేయడం, క్రిమి సంహారక మందు పిచికారి చేయడం అతడి విధి. అయితే ఎకరంలో కలుపు తీయడం ఒక్కడితో సాధ్యమయ్యే పనికాదు.

గ్రీన్‌ బడ్జెట్‌ కేటాయింపు

పల్లె ప్రకృతి వనాలకు బోరు, మోటారు సౌకర్యం కల్పించలేదు. అవకాశమున్న చోట సర్పంచ్‌లు దాతల సహకారంతో బోరు వే యిస్తున్నారు. మోటారు, చుట్టూ ఫెన్సింగ్‌, ఇతర అభివృద్ధి పనులకు గ్రామపంచాయతీ గ్రీన్‌బడ్జెట్‌ వాడాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేగాక పల్లెప్రకృతి వనాల్లో కూ ర్చోని ఆహ్లాదం పొందేందుకు బెంచీలు, కుర్చీలు, పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే వీటిని దాతల సహాయంతో సమకూర్చుకోవాలని అధికారులు చెబుతున్నారు.

అందంగా ఉండేలా పెంచుతున్నాం : మర్రిపెల్లి యాదయ్య, పాలడుగు సర్పంచ్‌

మోత్కూరు మండలం పాలడుగు శివారులో రెవెన్యూ శాఖ అధికారు లు చూపిన భూమిలో పల్లె ప్రకృతి వనం కోసం మొక్కలు నాటాం. నీటి ట్యాంకర్‌ అక్కడకు వెళ్లే దారిలేక మొక్కలు ఎండాయి. దీంతో మళ్లీ గ్రామం మధ్యలో ప్రభుత్వ భూమి సేకరించి పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశాం. నీడనిచ్చే, పండ్ల, పూల మొక్కలు నాటాం. మొక్కలు ప్రస్తుతం ఏపుగా ఐదారు అడుగుల వరకు పెరిగాయి. వనం మధ్యలో బాటలు తీశాం. మరో రెండేళ్లలో ఈ వనం గ్రామానికి కొత్త అందం తేనుంది. పాత ఊరు, కొత్త కాలనీకి వనం అందుబాటులో ఉంది.

పనులు పూర్తయ్యాయి : మందడి ఉపేందర్‌రెడ్డి, యాదాద్రి డీఆర్‌డీవో

అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వ నాల పనులు పూర్తయ్యాయి. చా లావరకు నర్సరీల్లో పెంచిన మొక్కలనే నాటాం. ఎప్పటికప్పుడు పల్లె ప్రకృతి వనాలను పర్యవేక్షిస్తూ తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నాం. వర్షాలు కురుస్తుండటంతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి.ఈ వనాల తో గ్రామాలు కొత్త శోభను సంతరించుకుంటాయి.

Updated Date - 2021-08-10T05:54:25+05:30 IST