పీఏసీఎస్‌ చైర్మనపై కేసు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2021-12-28T06:45:50+05:30 IST

దళిత సర్పంచ కు మారుడిపై దాడిచేసి గా యపర్చిన పీఏసీఎస్‌ చైర్మన, ఆయన అనుచ రులపై కేసు నమోదు చేయాలని బాధిత కు టుంబ సభ్యులు కోరా రు.

పీఏసీఎస్‌ చైర్మనపై కేసు నమోదు చేయాలి
పోలీస్‌స్టేషన ఎదుట ఆందోళన చేస్తున్న తుంగపాడు గ్రామస్థులు

స్టేషన ఎదుట గ్రామస్థుల ఆందోళన 

మిర్యాలగూడ అర్బన, డిసెంబరు 27: దళిత సర్పంచ కు మారుడిపై దాడిచేసి గా యపర్చిన పీఏసీఎస్‌ చైర్మన, ఆయన అనుచ రులపై కేసు నమోదు చేయాలని బాధిత కు టుంబ సభ్యులు కోరా రు. ఈ మేరకు స్థానిక టూటౌన పోలీస్‌స్టేషన ఎదుట సోమవారం ఆం దోళన చేశారు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సాగర్‌రోడ్డులో ఉన్న  రె డ్డి హోటల్‌లో భోజనం చేసేందుకు  ఆదివారం మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామ సర్పంచ కుమారుడు మచ్చ వెంకన్న వెళ్లాడు. అప్పటికే హోటల్‌లో ఉన్న త్రి పురారం మండలం పెద్దదేవులపల్లి పీఏసీఎస్‌ చైర్మన మందడి నాగేందర్‌రెడ్డి వెంకన్న ను  దూషించాడు. వెంకన్న ఆడ్డు చెప్పడంతో ఆగ్రహించిన పీఏసీఎస్‌ చైర్మన, ఆయన అనుచరులు, హోటల్‌ యజమానితో కలిసి రోకలిబండ, కత్తిపీటతో వెంకన్నపై దాడి చేశారు. ఈ ఘటనలో వెంకన్న,  కాసాని సైదులు తీవ్రంగా గాయపడ్డారు. వెంకన్న పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిం చారు. నాగేందర్‌రెడ్డి, ఆయన అనుచరులు, హోటల్‌ యజమానిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ  కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ  తుంగపాడు గ్రామస్థులు  ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై  పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ధర్నాలో మచ్చ సైదులు, మధు, బలరాం, వెంకన్న, సతీష్‌, సుజాత, వనజ, వెంకటమ్మ, ముత్తమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-28T06:45:50+05:30 IST