చిన్నారిపై దాడి చేసిన తండ్రిపై కేసు

ABN , First Publish Date - 2021-12-07T06:29:01+05:30 IST

చిన్నారిపై దాడి చేసిన తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

చిన్నారిపై దాడి చేసిన తండ్రిపై కేసు
గాయపడిన బాలుడితో తల్లి మాధురి

గరిడేపల్లి రూరల్‌, డిసెంబరు 6: చిన్నారిపై దాడి చేసిన తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ కొండ ల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన లకమళ్ల సురేష్‌కు నూతనకల్‌ మండలం యలకపల్లి గ్రామానికి చెందిన మాధురితో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఏడాదిన్నర వయసు ఉన్న కుమారుడు ఉన్నారు. హుజూర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల వ్యాన డ్రైవర్‌గా సురేష్‌ పనిచేస్తున్నాడు. ఈ నెల ఐదో తేదీన పాఠశాలకు సెలవు కావడంతో ఇంటివద్దే ఉన్నాడు. అదే రోజు కుమారుడిని కొట్టడంతో చెంపలు, రొమ్ము, కుడికాలిపై గాయాలయ్యాయి. కూలి పనులకు వెళ్లిన భార్య తిరిగి వచ్చి కుమారుడి ఒంటిపై ఉన్న గాయాలను చూసి భర్త సురేష్‌ను సరైన ప్రశ్నించగా చెప్పలేదు. భర్త సురేష్‌, ఆత్త మెరిశమ్మ తనను నిత్యం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, ఇప్పుడు కుమారుడిపై భర్త దాడి చేశారని పోలీసులకు మాధురి ఫిర్యాదు చేసింది. ఈ  మేరకు భర్త, అత్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.   

Updated Date - 2021-12-07T06:29:01+05:30 IST