విద్యుదాఘాతంతో ఎద్దు మృతి

ABN , First Publish Date - 2021-12-30T06:40:30+05:30 IST

సూర్యాపేట మండలం ఇమాంపేటలో విద్యు దాఘాతంతో ఎద్దు మృతి చెందింది.

విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
మృతిచెందిన ఎద్దు ఎదుట రోదిస్తున్న రైతు

సూర్యాపేట   రూరల్‌,  డిసెంబరు  29: సూర్యాపేట మండలం ఇమాంపేటలో విద్యు దాఘాతంతో ఎద్దు మృతి చెందింది. బాధిత రైతు కొండ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. ఇమాంపేట శివారు లోని వ్యవసాయ బావి వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ సమీపంలో ఎద్దు  బుధవారం మేత మేస్తూ ప్రమాదవశాత్తు తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెం దింది. రూ.70 విలు విలువైన ఎద్దు మృతి చెందినందున ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు కోరారు. ఎద్దు కళేబరం వద్ద రైతు రోదించారు.Updated Date - 2021-12-30T06:40:30+05:30 IST