గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-05-30T06:21:46+05:30 IST

చౌటుప్పల్‌ మండలం రెడ్డిబావి గ్రామ శివారులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైంది. నైల్‌ పరిశ్రమ వెనుకభాగంలో ఉన్న వాగులో మృతదేహం పడి ఉంది.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

చౌటుప్పల్‌ రూరల్‌, మే 29:  చౌటుప్పల్‌ మండలం రెడ్డిబావి గ్రామ శివారులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైంది. నైల్‌ పరిశ్రమ వెనుకభాగంలో ఉన్న వాగులో మృతదేహం పడి ఉంది. పశువుల కాపరి గమనించి గ్రామ సర్పంచ్‌కు సమాచారం అందించగా సర్పంచ్‌ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల క్రితమే గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిపోయి ఉంది. మృతుడి 35సంవత్సరాల వయస్సుకు పైగా ఉంటుందని పోలీసు లు భావిస్తున్నారు. మృతుడు జీన్‌ ప్యాంటు ధరించి శరీరంపై షర్టు లేకుండా ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-05-30T06:21:46+05:30 IST