సాగర్‌ కాల్వలో కొట్టుకువచ్చిన వ్యక్తి మృతదేహం

ABN , First Publish Date - 2021-10-29T06:02:35+05:30 IST

:మునగాల శివారులోని సాగర్‌ఎడమ కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సాగర్‌ కాల్వలో కొట్టుకువచ్చిన వ్యక్తి మృతదేహం

మునగాల, అక్టోబరు 28:మునగాల శివారులోని సాగర్‌ఎడమ కాల్వలో  గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం కాల్వ గేట్ల వద్ద వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం అందించారని తెలిపారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చామన్నారు. మృతుడికి 45 ఏళ్ల వయస్సు ఉంటుందని, నీలిరంగు గళ్ల చొక్కా, తెల్ల బనియన్‌, బ్లూ కలర్‌ జీన్స్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహానికి కాల్వ ఒడ్డునే శవ పరీక్ష నిర్వహించి, అక్కడే ఖననం చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. 


Updated Date - 2021-10-29T06:02:35+05:30 IST