హస్తినలో నవశకానికి నాంది

ABN , First Publish Date - 2021-09-03T06:22:55+05:30 IST

దేశరాజధానిలో తెలంగాణ భవన్‌ నిర్మించ తలపెట్టడం చారిత్రాత్మక ఘట్టమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

హస్తినలో నవశకానికి నాంది
శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌, మంత్రులు జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి

దేశ రాజధానిలో తెలంగాణ భవన్‌ నిర్మించతలపెట్టడం చారిత్రక ఘట్టం : మంత్రి జగదీ్‌షరెడ్డి

నల్లగొండ క్రైం, సెప్టెంబరు 2: దేశరాజధానిలో తెలంగాణ భవన్‌ నిర్మించ తలపెట్టడం చారిత్రాత్మక ఘట్టమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. అలాంటి అపురూపమైన ఘట్టాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌ హస్తినలో నవశకానికి నాంది పలికారని అభివర్ణించారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా గురువారం నిర్వహించిన తెలంగాణ భవన్‌ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమి పూజ నిర్వహించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఢిల్లీలో నిర్మించతలపెట్టిన తెలంగాణ భవన్‌ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిపోతుందన్నారు. ఇదే తెలంగాణ కోసం అహో రాత్రులు ఉద్యమ నాయకుడిగా పోరాడి విజయం సాధించిన సీఎం కేసీఆర్‌ స్వయంగా ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు శంకుస్థాపన చేయడం టీఆర్‌ఎస్‌ పార్టీకి మైలురాయిలాంటిదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, రాష్ట్రనేత చాడ కిషన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా నేతలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-03T06:22:55+05:30 IST