సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-30T06:48:23+05:30 IST

సినిమా టిక్కెట్ల ధరలపై ఏపీ ప్రభు త్వం సరైన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామ ర్స్‌ ప్రధాన కార్యదర్శి జల్లేపల్లి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. హుజూర్‌నగర్‌ పట్టణంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సినీ పరిశ్రమ 24 క్రాఫ్ట్‌లతో ఏర్పడిందన్నారు.

సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి
విలేకరులతో మాట్లాడుతున్న జల్లేపల్లి వెంకటేశ్వర్లు

 తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రధానకార్యదర్శి జేవీఆర్‌ 

హుజూర్‌నగర్‌ , డిసెంబరు 29: సినిమా టిక్కెట్ల ధరలపై ఏపీ ప్రభు త్వం సరైన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామ ర్స్‌ ప్రధాన కార్యదర్శి జల్లేపల్లి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.  హుజూర్‌నగర్‌ పట్టణంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సినీ పరిశ్రమ 24 క్రాఫ్ట్‌లతో ఏర్పడిందన్నారు. నిర్మాతలు, దర్శకులతో పాటు లక్షలాది మంది  కార్మికులు సినీ పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్నారన్నారు. నిర్మాతలు, టెక్నీషియన్ల శ్రేయస్సు దృష్ట్యా ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలపై సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  సినీ పరిశ్రమకు అనుకూలంగా సీఎం కేసీఆర్‌  నిర్ణయాలు తీసు కున్నారని, అందుకు కృతజ్ఞతలు తెలిపారు.

 సినిమా టిక్కెట్ల ధరలపై ఏపీ సీఎం జగన్‌ సానుకూల చర్యలు తీసుకోవాల న్నారు. సినిమా పరిశ్రమలోని పెద్దలకు, జగన్‌కు మధ్య కొంత గ్యాప్‌ ఏర్పడిందని, దానికి పరిశ్రమ పెద్దలే బాధ్యత వహించాలన్నారు ఈ సమావేశంలో రవికుమార్‌, సుతారి శ్రీనివాస్‌, రాజు, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

 జాతీయ స్థాయిలో గుర్తింంపు రావడం అభినందనీయం

 జర్నలిస్టు కోల నాగేశ్వరరావుకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అభినందనీయమని జల్లేపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో హుజూర్‌నగర్‌లో జర్నలిస్టు, జాతీయ సాహితీ రత్న అవార్డు గ్రహీత కోల నాగేశ్వరరావును సన్మానించి మాట్లాడారు. కార్యక్రమంలో కామిశెట్టి రవి,  శ్రీనివాస్‌, రాజు పాల్గొన్నారు.




Updated Date - 2021-12-30T06:48:23+05:30 IST