మంత్రి ఈటల రాజేందర్‌పై ఆరోపణలు తగవు

ABN , First Publish Date - 2021-05-02T05:44:42+05:30 IST

వైద్య, ప్రజారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై కావాలనే భూబ్జా ఆరోపణలు చేస్తున్నారని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వీరబోయిన లింగయ్య ఆరోపించారు.

మంత్రి ఈటల రాజేందర్‌పై ఆరోపణలు తగవు
తిరుమలగిరిలో ఎంపీ సంతోష్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు

సూర్యాపేట అర్బన్‌/ తిరుమలగిరి/ అనంతగిరి, మే 1: వైద్య, ప్రజారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై కావాలనే భూబ్జా ఆరోపణలు చేస్తున్నారని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వీరబోయిన లింగయ్య ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో  శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. బడుగు, బలహీన వ ర్గాల నాయకుడు ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్‌ అణగదొక్కే ప్ర యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే అనేకమంది టీఆర్‌ఎస్‌ నాయకులపై ఆరోపణలున్నా వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదో తె లపాలన్నారు. కార్యక్రమంలో రావుల మధు, గిరి, ప్రసాద్‌, అశోక్‌, రాజేష్‌, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, వంశీ, మహేష్‌ పాల్గొన్నారు. ఈటెల రాజేందర్‌పై ఆరోపణలు తగదని ముదిరాజ్‌ సంక్షేమ సంఘం జిల్లా అధ్య క్షుడు సారగండ్ల సురేష్‌కుమార్‌ అన్నారు. స్థానిక విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో కొండా అశోక్‌, సారగండ్ల సతీష్‌, వెంకన్న, మణి, దొండ శ్రీను పాల్గొన్నారు. ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో తిరుమల గిరిలో ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం నాయకులు మొగిలి ప్రసాద్‌, అరిగె బాలు, సాయి కిరణ్‌, వికాస్‌, గణేష్‌, చిరు పాల్గొన్నారు. అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగవరంలో ముదిరాజ్‌ సం ఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు మ హేష్‌, సురేందర్‌, గోపి, శ్రీను, అంజయ్య, నారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-02T05:44:42+05:30 IST