విద్యార్థుల్లో సామర్థ్యం పెంచేలా బోధన సాగాలి

ABN , First Publish Date - 2021-10-28T05:39:57+05:30 IST

విద్యార్థుల్లో సామర్థ్యం పెంచేలా విద్యాబోధన సాగాలని జిల్లా విద్యాశాఖాధికారి కె. అశోక్‌ అన్నారు. నేరేడుచర్లలోని జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్‌ నిబంధనలు అను సరించాలని సూచించారు. అనుకున్న సమయానికి అన్ని సిలబస్‌లు పూర్తి

విద్యార్థుల్లో సామర్థ్యం పెంచేలా బోధన సాగాలి
మధ్యాహ్న భోజనం పరిశీలిస్తున్న డీఈవో

నేరేడుచర్ల, అక్టోబరు 27: విద్యార్థుల్లో సామర్థ్యం పెంచేలా విద్యాబోధన సాగాలని జిల్లా విద్యాశాఖాధికారి కె. అశోక్‌ అన్నారు. నేరేడుచర్లలోని జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్‌ నిబంధనలు అను సరించాలని సూచించారు. అనుకున్న సమయానికి అన్ని సిలబస్‌లు పూర్తి చేసి, చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నిబంధనల మేరకు మెనూ అందుతుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్య క్రమంలో ఎంఈవో ఛత్రునాయక్‌, ప్రధానోపాధ్యాయుడు ఎల్‌. శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, రషీద్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T05:39:57+05:30 IST