ఉపాధ్యాయుడి సస్పెన్షన

ABN , First Publish Date - 2021-11-28T05:52:45+05:30 IST

మద్యం మత్తులో విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయు డు ఎం.లక్ష్మారెడ్డిని సస్పెండ్‌ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

ఉపాధ్యాయుడి సస్పెన్షన

మఠంపల్లి, నవంబరు 27: మద్యం మత్తులో విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయు డు ఎం.లక్ష్మారెడ్డిని సస్పెండ్‌ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. టీచ ర్‌ వ్యవహారశైలిపై అక్టోబరు 7న ‘మద్యం మత్తులో టీచర్‌ వీరంగం’ శీర్షికన ఆంధ్రజ్యోతి మినీలో కథనం ప్రచురితమైంది. లక్ష్మారెడ్డిని రామచంద్రాపురంతండా నుంచి డిప్యూటేషనపై చౌటపల్లికి పంపించారు. ఈ క్రమంలో పాఠశాల ప్రారంభంలోనే మద్యం తాగివచ్చి తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల ను బెదిరించాడు. ఆ సమయంలో స్థానిక సర్పంచతో పాటు మరికొందరు వారించినా వినిపించుకోకుండా వీరంగం సృష్టించాడు. ఈ ఘటనపై ఉపాధ్యాయుడి తీరుపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో స్పందించిన జిల్లా అ ధికారులు కలెక్టర్‌తో పాటు రాష్ట్రస్థాయి అధికారులకు నివేదించారు. అధికారుల ఫిర్యాదు మేరకు విచారించిన ఉన్నతాధికారులు ఉపాధ్యాయుడు లక్ష్మా రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ విద్యాశాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నారు. 


Updated Date - 2021-11-28T05:52:45+05:30 IST