’నేతన్నకు చేయూత’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-08-30T06:58:22+05:30 IST

చేనేత కార్మికులు ’నేతన్నకు చేయూత’ పథ కాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేనేత, జౌళి శాఖ ఏడీ విద్యాసాగర్‌ కోరారు.

’నేతన్నకు చేయూత’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మోత్కూరులో మాట్లాడుతున్న ఏడీ విద్యాసాగర్‌

మోత్కూరు, ఆగస్టు 29: చేనేత కార్మికులు ’నేతన్నకు చేయూత’ పథ కాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేనేత, జౌళి శాఖ ఏడీ విద్యాసాగర్‌ కోరారు. మోత్కూరు మార్కెండేయ ఫంక్షన్‌ హాల్లో  ఆదివారం నిర్వ హించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కరోనా కార ణంగా రద్దు చేసిన ఈ పథకాన్ని తిరిగి ప్రభుత్వం ప్రారంభించింద న్నారు. ఈ పథకంలో మగ్గాన్ని జియోట్యాంగింగ్‌ చేయించుకున్న చేనేత కార్మికుడితో పాటు మరో ఇద్దరు సహాయకులు దరఖాస్తు చేసుకోవచ్చ న్నారు. మగ్గం జియో ట్యాంగింగ్‌ ఉన్నా మగ్గం పని వదిలి వేరే పని చేస్తున్న వారు, 18ఏళ్ల లోపు వారు, విద్యార్థులు ఈ పథకంలో లబ్ధి పొందడానికి అనర్హులన్నారు. చేనేత కార్మికుడు, అతని సహాయకులు త్రిఫ్ట్‌ ఫండ్‌ పథకంలో వారు జమ చేసిన మొత్తానికి ప్రభుత్వం రెట్టింపు డబ్బు జమ చేస్తుందన్నారు. జిల్లాలో సుమారు ఆరు వేల మగ్గాలు ఉన్నాయని, మోత్కూరులో 121, గుండాలలో 109 మగ్గాలు జియో ట్యాంగింగ్‌ అయ్యాయన్నారు. ప్రస్తుతం జనగాం జిల్లాలో ఉన్న గుండాల చేనేత కార్మికులు త్రిఫ్ట్‌ ఫండ్‌ పఽథకం కోసం జిల్లాలో దర ఖాస్తు చేసుకోవచ్చన్నారు. వాస్తవంగా చేనేత వృత్తిలో ఉండి మగ్గం జియో ట్యాంగింగ్‌ కాని వారెవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని, వారం రోజుల్లో పరిశీలించి తాత్కాలిక నంబరు ఇస్తామన్నారు. త్వర లోనే చేనేత బీమా పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. సమావేశంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జెల్ది రాములు, చేనేత నాయకులు పాశికంటి లక్ష్మీనర్సయ్య, పోచం కన్నయ్య, కొక్కుల సత్యనారాయణ, గోవర్ధన్‌, గంగుల రాములు, డి.ఉప్పలయ్య, ఏడీవోలు కిషన్‌నాయక్‌, సాయికుమార్‌, అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.




Updated Date - 2021-08-30T06:58:22+05:30 IST