ఐసోలేషన్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-05-20T06:32:53+05:30 IST
కరోనా బాధితులు ఐసోలేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.

గుర్రంపోడు, మే 19: కరోనా బాధితులు ఐసోలేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మం డలంలోని కొప్పోల్ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. కరోనా సోకిన వారు ఐసోలేషన్ కేంద్రంలో చేరి చికిత్స తీసుకోవాల న్నా రు. ప్రభుత్వం వైద్య సిబ్బంది పర్యవేక్షణలో రోగులకు నిరంతర వైద్య పరీక్షలు చేయడంతో పాటు ఉచితంగా భోజనం, మందులు అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ గాలి సరిత రవికుమార్, సర్పంచ్‌జ్యోతి లిం గారెడ్డి, ఆర్‌ఆర్‌ఎస్ మండల కన్వీనర్ బల్గూరి నగేష్, ఎంపీటీసీ ఆవుల వెంకటయ్య, బొమ్ము నగేష్, ఆగయ్య, ఎంపీడీఓ సుధాకర్, రవి, నాగరాజు, అంజయ్య, రామక్రిష్ణ తదితరులున్నారు. పాఠశా లలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని డీఎంహెచ్‌వో కొండల్‌రావు పరిశీలించారు. ఆయన వెంట పీహెచ్‌సీ డాక్టర్ నవ నీత, ఉష, సర్పంచ్ జ్యోతిలింగారెడ్డి ఉన్నారు.